ప‌రిటాల ఫ్యామిలీ సైలెంట్ వెన‌క ఏం జ‌రిగింది...!‌

VUYYURU SUBHASH
వ‌రుస ప‌రాజ‌యాల‌ను ఎదుర్కొంటున్న అనంత‌పురం జిల్లా ప‌రిటాల ర‌వి కుటుంబం.. ఫుల్లు సైలెంట్ అయి పోయింది. ర‌వి స‌తీమ‌ణి.. మాజీ మంత్రి సునీత‌, ఆయ‌న కుమారుడు, రాజ‌కీయ వార‌సుడు ప‌రిటాల శ్రీరాంలు.. ఇంటికే ప‌రిమితం అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. గెలుస్తాడ‌ని అంచ‌నాలు పెట్టుకున్నా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో పెద్ద దెబ్బే త‌గిలింద‌ని.. ఈ కుటుంబానికి చెందిన నాయ‌కులు పేర్కొన్నారు. అయితే.. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా కోలుకుని.. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల్లో పాల్గొ న్నారు.ఈ నేప‌థ్యంలోనే స్థానిక ఎన్నిక‌ల్లో ముఖ్యంగా మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాల‌ని భావించారు..

కానీ, మ‌రోసారి జ‌గ‌న్ సునామీ రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపించ‌డంతో అనంత‌పురంలోనూ ఒక్క తాడిప‌త్రి త‌ప్ప‌.. అన్నీ వైసీపీ పరం అయ్యాయి. వాస్త‌వానికి ప‌రిటాల కుటుంబం విష‌యానికి వస్తే.. టీడీపీ అధినేత ఫ్రీహ్యాం డ్ ఇచ్చారు.. దీంతో ధ‌ర్మ‌వ‌రం మునిసిపాలిటీలో త‌మ వ‌ర్గం వారినే ప‌రిటాల కుటుంబం నిల‌బెట్టింది. వా రికే బీఫారాలు సైతం ఇచ్చారు. ఇక‌, ప్ర‌చారంలోనూ త‌ల్లీ కుమారుడు అలుపెరుగ‌కుండా పాల్గొన్నారు. ఇం టింటికీ తిరిగారు. సునీత అయితే... దాదాపు పాద‌యాత్రే చేశార‌ని చెప్పాలి.

ఇక‌, శ్రీరాం సైతం యువ‌తను ఎక్కువ‌గా స‌మీక‌రించి.. పార్టీని గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌ధానంగా వీరి రాక‌తో ధ‌ర్మ‌వ‌రం రాజ‌కీయాలు సంద‌డిగా మారాయి. అయితే... ఇంత ప్ర‌చారం చేసినా.. ఇంటింటికీ తిరిగినా.. ఇక్క‌డ వైసీపీనే విజ‌యం ద‌క్కించుకుంది. దీం తో ఇంత ప్ర‌య‌త్నించినా..వ‌ర్క‌వుట్ కాలేద‌నే ఆవేద‌న ప‌రిటాల వ‌ర్గంలో క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. నిజానికి ధ‌ర్మ‌వ‌రంలో క‌నుక పాగా వేస్తే.. వ‌చ్చే ఎన్నిక ‌ల్లో ఇక్క‌డ న‌నుంచి తామే టికెట్ ద‌క్కించుకోవాల‌ని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఇక్క‌డ పార్టీ గెలు పు గుర్రం ఎక్క‌క‌పోవ‌డం.. త‌ల్లీ కుమారుల ప్ర‌య‌త్నాలు సైతం ఫ‌లించ‌క‌క‌పోవ‌డం.. త‌మ‌కు రైట్ హ్యాండ్ ‌గా ఉన్న కొంద‌రు వార్డు స‌భ్యులు సైతం ఓట‌మి పాల‌వ‌డంతో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలి.. ఈ ఓట మిని ఎలా జీర్ణించుకోవాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: