హోలీ ఆడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

praveen
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ హోలీ.  ఇక హోలీ పండుగ వచ్చిందంటే చాలు పట్టణాలు నగరాలు గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల లో కూడా సందడి మామూలుగా ఉండదు.  హోలీ పండుగ వచ్చింది అంటే చాలు ఇక అందరిని కూడా రంగులో ముంచేయాలి అని చూస్తూ ఉంటారు స్నేహితులు. ఇక హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఏ ప్రాంతంలో చూసినా జనాలందరూ రంగురంగులుగా కనిపిస్తూ ఉంటారు.



 ఇక ప్రతి ఒక్కరి ఒంటి మీద ఎన్ని రకాల రంగులు ఉన్నాయో కూడా చెప్పడం చాలా కష్టమే హోలీ పండుగ రోజు.  హోలీ పండుగ అంటే ఇక వివిధ రకాల రంగులు తీసుకొచ్చి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని రకాల రంగులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు అని నిపుణులు ఎప్పటి కప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. హోలీ పండుగ రోజు రంగుల తో సెలబ్రేట్ చేసుకునే వారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తుంటారు నిపుణులు. ముఖ్యంగా వివిధ రసాయనాలతో తయారైన రంగుల జోలికి మాత్రం అస్సలు పోవద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు.


 అయితే హోలీ పండుగ ఆడాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా రంగుల విషయం లో ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి అని సూచిస్తున్నారు నిపుణులు.  జుట్టుకి ఎక్కువగా నూనె రాసుకుని హోలీ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇక రంగులు జుట్టుకు అంటుకున్న కూడా ఎంతో సులభం గానే వదిలి పోతాయట. అంతే కాకుండా చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత హోలీ పండుగ ఆడితే ఇక రంగులు అంటుకున్నప్పటికీ చర్మం పై ఎలాంటి ప్రభావం ఉండదు అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు హోలీ ఆడేటప్పుడు కాటన్ దుస్తులు ధరిస్తే ఎంతో మంచిది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: