ఆ బ్రాండ్ మొబైల్స్ ఇక మార్కెట్లో కనిపించవు .. కస్టమర్లకు ఊహించని షాక్..?

praveen
ప్రస్తుతం మొబైల్స్ వ్యాపారంలోకి ఎన్నో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో తమ కంపెనీ మార్కెట్ను పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకప్పుడైతే మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి అంటే  సామాన్యులకు సాధ్యం అయ్యేది కాదు.  కానీ నేటి రోజుల్లో మాత్రం మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి అంటే సామాన్యులకే కాదు నిరుపేదలకు కూడా సాధ్యం అయ్యే పరిస్థితి. ఎందుకంటే అతి తక్కువ ధరలకే మొబైల్ తయారీ కంపెనీలు ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఉన్నాయి నేటి రోజుల్లో. మొబైల్ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడం కోసం తక్కువ ధరకు మొబైళ్లను ఆకర్షించి మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.



 ఇలా నేటి రోజుల్లో ఎన్నో రకాల సెల్ఫోన్ కంపెనీలు మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫీచర్లను అందిస్తూ తక్కువ సమయంలోనే మంచి డిమాండ్ సంపాదించుకుంటు ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి మొబైల్ వ్యాపారం లో కొనసాగుతున్న కొన్ని కంపెనీలు తీవ్రంగా నష్టాలు చవి చూడటం తో చివరికి మొబైల్ వ్యాపారానికి స్వస్తి చెప్పడం లాంటివి కూడా చేస్తున్నాయి అనే విషయం తెలిసిందే .  ఎన్నో ఏళ్ల నుంచి కేవలం మొబైల్స్ మాత్రమే కాదు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను అందిస్తూ ఎన్నో సేవలు అందించిన ఎల్జి మరికొన్ని రోజుల్లో మొబైల్ వ్యాపారం నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.



 మొబైల్  విభాగంలో గత ఐదేళ్లలో భారీగా నష్టాన్ని చవిచూసింది ఎల్జీ కంపెనీ. దాదాపు 4.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన ఎల్జీ ఇక ఈ విభాగానికి స్వస్తి పలకాలని సిద్ధమైంది. అయితే ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్.. వియత్నాం కు చెందిన మరో కంపెనీ తో పాటు మరో రెండు బడా కంపెనీలు కూడా సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇప్పటికే మొబైల్ వ్యాపారం కారణంగా భారీగా నష్టాలు చవిచూసిన ఎల్జి వీలైనంత త్వరగా మొబైల్ వ్యాపారానికి స్వస్తిచెప్పి ఇక మొబైల్ మార్కెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: