కరోనా ఎఫెక్ట్.. పిల్లల్లో ముంచుకొస్తున్న కొత్త ముప్పు..?

praveen
కరోనా వైరస్ ప్రభావం దేశంలో ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఒకప్పుడు అతి తక్కువ కేసులు నమోదవగా ఆ తర్వాత మాత్రం ఒకే రోజులో లక్షల్లో కేసులు నమోదు కావడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఇక ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య కాస్త తగ్గింది అనుకునేలోపే మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  అయితే ఇప్పటికే దేశంలో లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.


 అంతేకాదు ఎన్నో కుటుంబాలు దుర్భర స్థితిని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఎంతో మంది కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  అయితే ఇక ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కరోనా వైరస్ కారణంగా అటు పిల్లలకు కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నది వెల్లడైంది. ముఖ్యంగా  వైరస్ కాలంలో పిల్లల్లో స్థూలకాయం ముప్పు ఎక్కువ అవుతుంది అన్నది ఇటీవల నిపుణులు చెబుతున్నారు.  కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి..  ఇక బయటికి వెళ్ళాలి అంటే భయపడటంతో అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.



 ఈ క్రమం లోనే ఫోన్లు కంప్యూటర్లు లాంటివి ఎక్కువగా వాడుతూ ఒకే దగ్గర కూర్చోవడం లాంటివి చేస్తున్నారు..  కరోనా వైరస్ ప్రభావం దృశ్య ఇక బయటకు వెళితే ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందో అని కనీసం ఆడుకోవటానికి కూడా బయటకు వెళ్లడం లేదు. వెరసి రోజు రోజుకు పిల్లల్లో స్థూలకాయం ముప్పు పెరిగిపోతుంది అన్నది అర్థం అవుతుంది. అయితే ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువగా జంక్ ఫుడ్ కి అలవాటు పడడంతో ఇంకా ఎంతో మంది పిల్లల్లో ఒబిసిటీకి పెరుగుతుంది అన్నది ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో తేలింది అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: