కేరళలో ఎన్డీఏ కు భారీ షాక్.. ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ..

frame కేరళలో ఎన్డీఏ కు భారీ షాక్.. ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ..

Satvika
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే సారి నిర్వహించనున్న సంగతి తెలిసిందే.. తమిళనాడు, కేరళ లో ఎన్నికలు రసా భాసగా మారాయి.. తమిళనాడులో రాజకీయ నేతలు ప్రచారంలో జోరును పెంచారు. అదే విధంగా కేరళ లో కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే కేరళలో కొన్ని పార్టీలకు భారీ షాక్ ఎదురైంది. కొన్ని నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


విషయానికొస్తే.. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్‌లోని గురువాయూర్‌, ఇడుక్కి జిల్లా లోని దేవికుళం లో నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను సంబంధిత అధికారులు తిరస్కరించారు. తలసేరి జిల్లా లో బీజేపీ ఆ పార్టీ కన్నూర్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు ఎన్‌ హరి దాస్‌ను బరిలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 22,125 ఓట్లు సాధించింది..


అయితే, హరిదాసు దాఖలు చేసిన నామినేషన్ పత్రం లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి సంతకం లేదంటూ నామినేషన్‌ను తిరస్కరించారు.గురువాయూర్‌లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నివేదా, కేరళలో కూటమి అభ్యర్థి అయిన ధనలక్ష్మి నామినేషన్లు.. అలాగే  దేవి కుళంలో ఏఐ ఏడీఎంకే అభ్యర్థి నామినేషన్‌ సైతం తిరస్కరించగా.. కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, బీజేపీకి చెందిన సీనియర్‌ నామినేషన్‌ను తిరస్కరించడం ఆ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య రహస్య ఒప్పందం లో భాగమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయ రాఘవన్ ఆరోపించారు. మరి ఈ ఎన్నికలు ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో చూడాలి.. మరోవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్  లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు పూర్తి అయ్యే లోపు ఇంకెన్ని జరుగుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: