లిఫ్ట్ అడిగింది.. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది..?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకువచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మనుషుల జీవితాలు దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటివి అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉన్న వారు ఇక ఒక్కసారిగా మృత్యుఒడిలోకి చేరిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  అంతా సంతోషంగా సాగిపోతూ ఉంటే ఇక విధి  చిన్న చూపు చూడడం తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చి అందరిని కంటతడి పెట్టిస్తుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ కిందికి జారి పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదఛాయలు నింపింది.ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రాయపూర్ మండలం కి చెందిన పుష్పమ్మ అనే మహిళ.. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఇక వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ చూసుకుంటూ ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్న ఆమె ఆనందాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది.. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను కబలించింది మృత్యువు.



 అయితే ఇటీవలే పుష్పమ్మ పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో అటువైపుగా వస్తున్న  ఒక ద్విచక్ర వాహనాన్ని  లిఫ్ట్ అడిగింది. ఇక ఆ వ్యక్తి కూడా సదరు మహిళకు లిస్ట్ ఇచ్చాడు. అయితే ఆమె వెళుతున్న రహదారి సరిగా లేకపోవడం పూర్తిగా గుంతలు గుంతలు గా ఉండటంతో.. ఇక ఏకంగా బైక్ అదుపు తప్పడంతో ఇక ఆమె ద్విచక్ర వాహనం మీద నుంచి కింద పడిపోయింది ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: