బడికి పంపిస్తే.. బాలికలతో ఇలాంటి పనులు చేయిస్తారా.. ఛీ..ఛీ..?

praveen
కరోనా వైరస్  వెలుగులోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల నిర్వహణ అనేది ప్రస్తుతం ఎంతో కష్టతరంగా మారింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చాలా రోజుల వరకు కూడా విద్యా సంస్థలు పూర్తిగా మూతపడి పోయాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క విద్యార్థి కూడా సరైన జాగ్రత్తలు పాటించే విధంగా ప్రస్తుతం అధికారులు చర్యలు చేపడుతున్నారు అనే విషయం తెలిసిందే.  ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ బారినపడి విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని భావిస్తున్న అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు.



 ఈ క్రమంలోనే విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవడం ఇక ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే.. కొన్ని పాఠశాలల్లో మాత్రం దీనికి అంతా విరుద్ధంగా ఉంది నిబంధనలు పాటించడం కాదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా విద్యార్థులతో అన్ని పనులు చేపిస్తున్నారు. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట రాంపురం సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో.



 సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇటీవలే టాయిలెట్లు శుభ్రం చేస్తూ ఉండటం వివాదాస్పదంగా మారిపోయింది. మామూలు సమయంలో విద్యార్థులు ఎలా ఉన్నప్పటికీ ఇక ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా విద్యార్థులను చేసుకోవాల్సిన వారు ఏకంగా విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ ఉండడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఏకంగా ఈ పాఠశాలలో 560 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఓ వైపు పాఠశాలల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉంటే ఇలా పాఠశాల విద్యార్థులతో టాయిలెట్ క్లీన్ చేయించడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: