బర్త్ డే కి కార్ ఇప్పిస్తానన్న ప్రియురాలు.. చివరిలో ఊహించని ట్విస్ట్..?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. సోషల్ మీడియా వేదికగా ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షల రూపాయల నగదు నగలు ఆభరణాలు కూడా దోచుకుపోయింది. ఈ ఘటన మైసూరులో వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు ఆంధ్ర హళ్లి రెండో ప్రధాన రహదారిలో నివాసముండే బిందు గౌడ అనే 25 ఏళ్ల యువతి టెన్త్ చదివింది. ఫేస్బుక్ లో చిన్ను గౌడ అనే పేరుతో ఒక ఖాతా తెరిచి రవి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అందమైన ఫోటోలను యువకుడికి పంపించి ఇక ఆ తర్వాత ప్రేమిస్తున్నాను అంటూ మాయ మాటలు మొదలు పెట్టింది.
తనకు కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఇక... నీ పుట్టినరోజు నాడు ఏకంగా 45 లక్షల విలువచేసే ఫార్చునర్ కారు బహుమతిగా ఇస్తానని ఒక లక్ష రూపాయలు తక్కువగా ఉన్నాయి పంపించాలి అంటూ యువకున్ని కోరింది యువతి. దీంతో ఆ యువకుడు వెనకా ముందు ఆలోచించకుండా లక్ష రూపాయల పంపాడు ఇక ఆ తర్వాత.. పలుమార్లు నగలు కూడా కావాలి అని కోరడంతో పంపించాడు ఇక ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన రవి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు బిందు గౌడ అని గుర్తించి అరెస్టు చేశారు. గతంలో కూడా ఆమెపై కేసులు ఉన్నట్లు గుర్తించారు.