ఆహారంలో నెయ్యి తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?
కానీ నేటి రోజుల్లో మాత్రం అలా జరగడం లేదు.. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఇక డాక్టర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. అక్కడ భారీగా ఫీజులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక సామాన్య ప్రజలు ఇలా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కేవలం వంటింటి చిట్కాలతో చెక్ పెట్టవచ్చు అన్నది మాత్రం చాలామందికి తెలియదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఆహారంలో నెయ్యి తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన ఓమెగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ప్రతిరోజూ ఆహారంలో నెయ్యి ఒక భాగం చేసుకోవడం వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను కూడా ఆరోగ్యంగా దృఢంగా చేసేందుకు నెయ్యి ఉపయోగపడుతుందట. కంటి చూపు మెరుగు పరచడం జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందట. ఇక నెయ్యి తరచూ తినడం వల్ల వృద్ధాప్య లక్షణాలు కూడా తొందరగా రావట. ఉదయాన్నే లేచి నెయ్యి తీసుకోవడం ద్వారా అటు మలబద్ధకాన్ని కూడా దూరం చేయవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.