వేసవిలో తరచు మజ్జిగ తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..?

praveen
వేసవి వచ్చిందంటే చాలు సూర్యుడి ప్రతాపంతో  ప్రజలందరూ బెంబేలెత్తి పోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంతేగాని భయపడిపోతుంటారు జనాలు. కానీ తప్పనిసరిగా తప్పదు కాబట్టి ఇక ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్లేవారు ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొంతమంది ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి సూర్యుడి వేడి నుంచి తట్టుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక ఎండ తీవ్రతకు ఎన్నోసార్లు నీరసించిపోవడం... వడ దెబ్బ తగలడం లాంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే వేసవిలో భగభగ మండిపోతున్న సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా సమ్మర్ లో దొరికే పుచ్చకాయ తినడం వల్ల ఎంతో ఉపశమనం ఉంటుంది అని కూడా చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఎంతో మంది ఇక సూర్యరశ్మి నుంచి తప్పించుకోవడానికి వేడి నుంచి శరీరాన్ని చల్లబరచ డానికి ఎక్కువగా మజ్జిగ తాగడానికి ఆసక్తి చూపుతూ  ఉంటారు ఎంతమంది. ఎండాకాలంలో ఎక్కడ చూసినా కూడా మజ్జిగ దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.




 అయితే వేసవికాలంలో సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగ తాగడం వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటున్నారు. అంతేకాకుండా శరీరం డీహైడ్రేషన్ కు  గురికాకుండా ఉండేందుకు  మజ్జిగ తాగితే ఎంతగానో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ ను  తగ్గించడమే కాదు రక్త సరఫరా కూడా మెరుగవుతుందట.  అంతే కాదు తరచు మజ్జిగ తాగడం వల్ల అటు చర్మం కాంతివంతంగా మారుతుంది అని చెబుతున్నారు నిపుణులు. శరీరానికి కాల్షియం అంది  ఇక దంతాలు జుట్టు కూడా ఎంతో దృఢంగా మారుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: