పీరియడ్స్ టైం లో.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోకండి..?

praveen
ఒకప్పుడు ఆడవాళ్లు తమకు వచ్చే సమస్యల గురించి బయటకు చెప్పుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవారు  అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో మాత్రం... పురుషులతో సమానంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేపథ్యంలో ఇక వారి సమస్యలను నిర్మొహమాటంగా నిర్భయంగా చెప్పడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు . ఈ క్రమంలోనే మహిళలకు సంబంధించిన సమస్యల గురించి... ఇక అందరి లో కూడా అవగాహన  పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ప్రతినెల రుతుక్రమం అనేది మహిళల్లో  సర్వసాధారణం అన్న  విషయం తెలిసిందే. ఇది ప్రకృతి ధర్మం కూడా. అయితే ఒకప్పుడు ఇలా పీరియడ్స్ గురించి బయట మాట్లాడటానికి కూడా మహిళలు ఇబ్బందులు పడేవారు. పీరియడ్స్ అనేది అదేదో బూతు లాగా చూసేవారు కానీ నేటి రోజుల్లో మాత్రం తమ సమస్యలను నిక్కచ్చిగా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా కాకుండా ఇక వారి ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కూడా తెచ్చుకుంటున్నారు మహిళలు  అన్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మహిళల్లో  తలెత్తే పలు రకాల రెగ్యులర్ సమస్యల గురించి అవగాహన తెచ్చుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా కొంత మంది మహిళలు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో.. కొందరు అవగాహన లేక ఎన్నో ఇన్ఫెక్షన్స్ కొని తెచ్చుకుంటున్నారు.



 మహిళలు పీరియడ్స్ టైం లో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. రక్తస్రావం తక్కువగా ఉన్నా సరే ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి న్యాప్ కిన్  మార్చుకోవడం ఎంతో మంచిది అని చెబుతున్నారు.  రక్తస్రావాన్ని సరిగా శుభ్రం చేయక పోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో రక్తస్రావాన్ని శుభ్రం చేసుకుంటే ఎంతో మంచిదట. పీరియడ్స్ సమయంలో శుభ్రమైన లోదుస్తులు వాడాలని ఫిట్ గా వుండే లో దుస్తులు వాడకూడదు అంటూ సూచిస్తున్నారు. రక్తస్రావం కారణంగా నిరసించి పోయే అవకాశం ఉందని ఆ సమయంలో..  పండ్ల రసాలు తాగడం పెరుగు ఎక్కువగా తాగడం లాంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: