అక్కడ లీటర్ పాల ధర అక్షరాలా 2628 రూపాయలట. !!
వివరాల్లోకి వెళితే యుకేలోని సోమెర్‌సెట్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల ఫ్రాంక్ షెల్లార్డ్ మరే గుర్రం పాల వ్యాపారం చేస్తున్నాడు. ఫ్రాంక్ మరేకి 14 గుర్రాలు ఉన్నాయి. అయితే రాను రాను ఆ పాలకు విపరీతమైన డిమాండ్ వస్తుండటంతో గుర్రం పాల వ్యాపారాన్ని తన వృత్తిగా ఎంచుకుని ఏకంగా మిలియనీర్‌గా మారిపోయాడు. ఇతని వద్ద గుర్రం పాలు కొనుగోలు చేసే వారిలో హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ఉన్నారట. ఫ్రాంక్ మరే.. గుర్రం పాలను బాటిళ్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాడు. లీటర్ పాలను రూ. 2628 గా నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నాడు.
అసలు గుర్రం పాలకి ఎందుకు అంత డిమాండ్ అంటే అవు పాల కంటే గుర్రం పాలు బలవర్ధకమైనవని నిపుణులు చెబుతున్నారు. గుర్రం పాలలో పోషకాలు చాలా ఉంటాయట. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరైడ్, సల్ఫర్ వంటి ప్రధాన ఖనిజ పదార్థాలు ఈ పాలలో ఉంటాయని చెబుతున్నారు. ఈ పాలలో కొవ్వు పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయ. సి విటమిన్ పుష్కలంగా ఉంటుందట. అందుకే ఆవు పాల కన్న గుర్రం పాలు మంచివి అనే భావనతో ఆ పాలను కొనుగులు చేస్తున్నారు.