పెట్రోల్ లేకుండానే 300 కిలోమీటర్లు ప్రయాణించగల కారు.. ఒడిస్సా రైతు సంచలన ఆవిష్కరణ

frame పెట్రోల్ లేకుండానే 300 కిలోమీటర్లు ప్రయాణించగల కారు.. ఒడిస్సా రైతు సంచలన ఆవిష్కరణ

Suma Kallamadi
ఎందరో రైతులు వినూత్నమైన ఆలోచనలతో ఎన్నో ఆవిష్కరణలు సృష్టించారు. వారి ఆవిష్కరణలు ఇతర రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యం గా భారతదేశ వ్యాప్తంగా ఎందరో రైతులు పరిమిత పరికరాలతో ఎన్నో సరికొత్త వస్తువులను సృష్టించి ఆశ్చర్యపరిచారు. కాగా తాజాగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక రైతు పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా 300 కిలోమీటర్ల ప్రయాణించగల ఒక కారు ని తయారు చేశారు.


అయితే ఇది సోలార్ బ్యాటరీతో పని చేసే కారు కాగా దీనిపై ప్రయాణాలు చేయడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఈ కారు కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించగలదని ఒడిస్సా రైతు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధర మండిపోతున్న నేపథ్యంలో సౌరశక్తితో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి వెలుగులోకి రావడంతో నెటిజన్లు దీనిపై విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ కారు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఇది ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం పదండి.


మయూరభంజ్‌ కి చెందిన సుశీల్ అగర్వాల్ అనే ఓ రైతు కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు తన సొంత వర్క్ షాప్ లో పని చేయడం ప్రారంభించారు.. ఆ సమయంలోనే ఒక కారు తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తనకు వచ్చింది. వెంటనే తాను తన ఆలోచనను కార్యాచరణలో పెట్టి 850 వాట్స్ మోటారుతో 100 ఆహ్/ 54 వోల్టుల బ్యాటరీతో ఒక కారు తయారు చేశారు. మోటార్ వైండింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, చట్రం అమర్చడం వంటి పనులు అన్నీ కూడా తన వర్క్ షాప్ లోనే పూర్తి చేశామని ఆయన అన్నారు.


అయితే ఈ వాహనం తయారుచేయడానికి తనకు తన వర్క్‌షాప్‌లో పనిచేసే ఇద్దరు మెకానిక్స్ సహాయ పడ్డారు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ కార్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ పనుల విషయంలో తన స్నేహితుడి సలహాలు తీసుకున్నానని ఆయన తెలిపారు. ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుందని కానీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించోచ్చని ఆయన చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: