మాస్క్ లేకపోతే.. కేసిఆర్ కు కూడా నో ఎంట్రీ..?
దీంతో ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇక ప్రాణభయం అందరిలో పోయింది అని చెప్పాలి. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది అన్నది అర్థం అవుతుంది. ప్రస్తుతం మహారాష్ట్ర కేరళ కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక అంతకు ముందులా ఇతర రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగి పోకుండా ఉండేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది అని అర్థమవుతుంది ఈ క్రమంలోనే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. అయితే మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో కరోనా వైరస్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాస్క్ పెట్టుకోకపోతే సభలోకి అనుమతించకూడదు అంటూ ఆదేశించారు. గత సమావేశాల్లో సిబ్బంది పోలీసులు మీడియా వారికి వర్తింపు చేసిన నిబంధనను ఇక ఇప్పుడు అందరికీ వర్తిస్తాయి అని తెలిపారు. అందరికీ కరోనా వైరస్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి అంటూ తెలిపారు.