చైనా తుపాకులు బయటపడ్డాయి.. ఆటకట్టించిన సైన్యం..?

praveen
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఒక రకంగా మినీ యుద్ధమే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మత రాజ్య స్థాపన ధోరణితో ఎప్పుడూ పాకిస్తాన్ ఉగ్రవాదులను  భారత్పై ఉసిగొల్పుతు ఉంటుంది. ఏదో ఒక విధంగా భారత్ లోకి ప్రవేశించి ఇక భారీగా ఉగ్ర కుట్ర కు ప్లాన్ చేస్తూ ఉంటారు ఉగ్రవాదులు.  ఇప్పటికే  భారతదేశంలో ఎన్నో సార్లు ఉగ్ర  కుట్ర కుట్ర కారణంగా బాంబు పేలుళ్లతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు  కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఉగ్రవాదుల కదలికలపై అడుగడుగునా నిఘా పెడుతూనే ఉంటుంది భారత సైన్యం. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు.



 అంతేకాదు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తు ఇక ఎక్కడికక్కడ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసి మట్టు పెడుతుంది భారత సైన్యం.  ఈ క్రమంలోనే ఉగ్రవాదులు  మన దేశ సరిహద్దుల్లో కి అడుగుపెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అనే విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు భారత సైన్య అప్రమత్తం గా ఉంటున్నారు. వివిధ రకాల ఆపరేషన్లు చేపడుతూ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మన దేశం లోకి రావడానికి ఉగ్రవాదులు ఏర్పరుచుకున్న సొరంగాలను కూడా గుర్తించి వారి ఆటలు  కట్టిస్తున్నారు.



 ఇక ఇటీవలే మరో ఉగ్ర  కుట్ర భగ్నం చేసిన సరిహద్దు దళాలు ఇక ఉగ్రవాది దగ్గర నుంచి చైనాకు సంబంధించిన  ఆయుధాలను చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని దొడ్డ జిల్లాలో సిఆర్పిఎఫ్ జవాన్లు ఎస్ ఎస్ బి, సైన్యం పోలీసులు కలిసి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పిర్దౌస్ అహ్మద్ అనే ఉగ్రవాదిని  అరెస్టు చేశారు.  అతని దగ్గర నుంచి మూడు చైనా తుపాకులు మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. అయితే ఇలా ఉగ్రవాదులకు సహాయం చేసే వారికి కూడా కఠిన శిక్షలు తప్పవు అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: