పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టిన విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

praveen
ఈ మధ్య కాలంలో దేశంలో పోలీస్ శాఖ ప్రజలందరికీ తమపై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తెరమీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరికీ తో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ఎంతో మంది పోలీసులు ముందుకు వస్తున్నారు.  అయితే ఈ మధ్య కాలంలో పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉండడమే కాదు సామాజిక సేవలో కూడా ఎంతగానో ముందుంటున్నారు అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక ప్రజలను తమ బాధ్యతగా తీసుకొని ఎంతో మంది నిరుద్యోగులకు శిక్షణ అందించడం జాబ్ మేళా నిర్వహించడం వంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఎన్నో ప్రశంశలు అందుకొంటున్నారు పోలీసులు.


 ఇటీవలే ఢిల్లీ పోలీసులు కూడా  విద్యార్ధుల కోసం ఇలాంటి ఒక గొప్ప ఆలోచన చేశారు.బస్తి  విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ లైబ్రరీగా మార్చేశారు.  సమీప ప్రాంతాల్లోని మురికివాడలకు చెందిన పిల్లలు చెడు  మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు చదువుకోవడానికి ప్రోత్సహించేలా వినూత్న ఆలోచన చేసి ఏకంగా పోలీస్ స్టేషన్ లైబ్రరీగా మార్చేసారు. ఇక ఈ లైబ్రరీలో పిల్లలకు అవసరమైన మేగజైన్లు వార్తా పత్రికలు అందుబాటు లో ఉంచారు.



 అయితే పోలీస్ స్టేషన్ లో లైబ్రరీ ఏర్పాటు పై అధికారి రాజేష్ శర్మ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.  కరోనా వైరస్ కారణంగా  దాదాపు సంవత్సరం పాటు పాఠశాలలు మూతపడ్డాయి. సమీపంలో నివసించే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ క్రమంలోనే ఇక వినూత్న ఆలోచన చేసి పోలీస్స్టేషన్లోనే లైబ్రరీ ఏర్పాటు చేశాము  అంటూ చెప్పు కొచ్చారు. ఇప్పుడు ఎంతో  మంది పిల్లలు ఇక్కడ పోలీస్ స్టేషన్కు వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాల ను  చదువుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పోలీస్ స్టేషన్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది జనాలు ఆ లబ్ధి పొందే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: