నెట్ ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్.. అలా అయితే కష్టమే అంటున్న టెక్ నిపుణులు..
దీంతో ఇకపై సభ్యత్వం తీసుకున్న యూజర్లు తమ పాస్వర్డ్స్ స్నేహితులతో షేర్ చేసుకోవడం కష్టమైపోతుంది. లాగిన్ అయ్యే ముందు కంపల్సరిగా ఖాతా కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇవ్వటం తప్పనిసరి కావడంతో ఇక వేరే వాళ్ళు నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ని షేర్ చేసుకోవడం దాదాపు అసాధ్యం అయిపోతుంది. దీంతో కొత్త అకౌంటు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నెట్ ఫ్లిక్స్ బాగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
నెలరోజులకి నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేట్ అక్షరాలా 800 రూపాయలు. ఇదే మొత్తం డబ్బులతో ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫోరమ్స్ పై సంవత్సరం కాలవ్యవధితో రెండు అకౌంట్లు తీసుకోవచ్చు. అయితే నెలరోజులకే 800 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి చాలా మంది వినియోగదారులు తమ స్నేహితులతో కూడా అకౌంట్ ని షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇకపై పాస్వర్డ్ షేరింగ్ ని క్లిష్టతరం చేసేందుకు నెట్ ఫ్లిక్స్ నడుం బిగించింది. అయితే పాస్వర్డ్ సెక్యూరిటీ పై చేసే చేంజెస్ ఇంకా తొలి దశలోనే ఉన్నాయని త్వరలోనే వినియోగదారులపై ఆ రూల్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఈ నిబంధనల వల్ల యూజర్ల నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో టెస్ట్ చేయడానికి ముందస్తుగా ఇగ్నోర్ చేయగల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం రెడీ అవుతోంది. అయితే మిగతా అన్ని డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ తక్కువ ధరకే లభిస్తుండటంతో పాటు పైరసీ కూడా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కఠినమైన రూల్స్ పెట్టడం గమనార్హం. దీనితో అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.