ఖాళీ చేతులతో వెళ్ళడం ఎందుకని.. ఆ దొంగ ఏం చేశాడో తెలుసా..?
ఇలా ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో రకాల చిత్రవిచిత్రమైన దొంగతనాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా దొంగతనానికి వెళ్లిన వారు ఎంతో కష్టపడివెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ దొరకలేదు అంటే నిరాశతో వెనుదిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక దొంగ మాత్రం అలా నిరాశతో వెనుదిరగ లేదు కావలసినది దొరకకపోతే ఏంటి ఏదో ఒకటి దొంగతనం చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఇక్కడ ఒక దొంగ చేసిన సిల్లీ చోరీ కాస్త అందరిని ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక్కడ ఓ దొంగ బైక్ దొంగతనం కోసం వచ్చాడు.. కానీ బైక్ దొంగతనం వీలు కాకపోవడంతో మరొకటి తీసుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. మీర్ పేట లో ఓ వ్యక్తి తెల్ల డ్రెస్ వేసుకొని నడుస్తూ వచ్చాడు. ఇంటి బయట పార్క్ చేసి ఉన్న బైక్ ల వద్ద ఆగి అక్కడ ఉన్న పల్సర్ 220 దొంగిలించడానికి ప్రయత్నించాడు. బైక్ ఫ్రంట్ డూమ్ కవర్ ను తీసేసాడు ఆ తర్వాత హ్యాండిల్ లాక్ తీయడానికి ప్రయత్నించగా అది ఎంతకీ రాలేదు దీంతోబైక్ ఎత్తుకెళ్ళడం తన వల్ల కాదు అనుకున్నాడు ఉత్తి చేతులతో పోవడం ఎందుకు అని డూమ్ తీసుకొని పారిపోయాడు. దీనికి సంబంధించిన ఫుటేజ్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఇక ఆ తర్వాత ఉదయం చూసిన యజమానులు ఆశ్చర్యపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.