వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా.. మళ్ళీ కరోనా పాజిటివ్.. చివరికి..?
గాంధీనగర్లోని దేహగాం కు చెందిన ఒక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా పాజిటివ్ రావడం అందరినీ కలవరపెడుతోంది. గాంధీనగర్లోని దేహగం తాలూకాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ అధికారి జనవరి 16వ తేదీన వాక్సిన్ తీసుకున్నారు ఇటీవలే రెండో తీసుకున్నారు. తరువాత మూడు రోజులకే ఆయన జ్వరంతో బాధ పడటం తో అయన నుంచి నమూనాలను తీసుకొని కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే సదరు అధికారి లో చాలా తక్కువ స్థాయి లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి అని ప్రస్తుతం వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ పలు రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అధికారులు. అయితే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత 45 రోజులకు యాంటీబాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉండటాన్ని గ్రహించాము అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ఇక కరోనా వైరస్ దరి చేరకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం లాంటి నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సూచిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.