మత మార్పిడి విషయంలో ఆ లాజిక్ పూర్తిగా తప్పు...!!!
అసలు నిజానికి ప్రపంచంలో విద్య అనే పదం పుట్టుకోచ్చింది మన ఇండియా నుంచే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు మన దేశంలోనే ప్రవేశపెట్టారు. అందుకు ఉదాహరణలే తక్షశీల, నలంద విశ్వవిద్యాలయాలు.. ఇక మతం, కులం అనే విషయానికి వస్తే మొదటగా ముస్లింల వల్లే బేధాలు వచ్చాయి. వారు మనదేశానికి వచ్చి. ముస్లిం మతాన్ని ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చాక క్రైస్తవ మతం పరిచయం అయ్యింది.
అప్పట్లో వాళ్ళ దగ్గర పని చేసే మనవాళ్ళు క్రైస్తవ మతంలోకి మారారు. అయితే ఆనాటి కాలంలో పెద్ద కులాల వారు చిన్న కులాల వారిని చిన్నచూపు చూసేవారట.అది అన్ని వూళ్లలో జరిగేది కాదట. కేవలం కొన్ని వూళ్లలో మాత్రమే జరిగేదట. ఇక వారు అలా చిన్నచూపు చూడటానికి దానికి వేరు వేరు కారణాలు వున్న కాని దానికి మత మార్పిడి కూడా ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. కాని కాదు 1715 వ సంవత్సరంలోనే రెడ్డి కులాలకు చెందిన వారు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు.అంతే కాని మత మార్పిడి వల్ల పెద్ద కులాల వారు చిన్న కులాల వారిని చిన్న చూపు చూసారనడంలో ఎలాంటి లాజిక్ లేదని స్పష్టంగా అర్ధమవుతుంది...