విజయనగరం అడవుల్లో ఊహించని విప్లవం.. ఇది సరికొత్త చరిత్రే..?
సత్యం మాస్టారు అనేటువంటి ఒక టీచర్ గిరిజనులు అందరినీ కూడా సమీకృతం చేసి గిరిజనుల హక్కుల సాధించడం కోసం.. ప్రభుత్వ పెద్దల దోపిడిని ఆపేందుకు అందరినీ ఏకం చేసి ఆయుధాలను చేతపట్టి సాయుధ పోరాటం చేశారు. ఇక ఈ సాయుధ పోరాట నియంత్రణ కోసం అప్పట్లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం విజయ నగరం జిల్లాలో పరిస్థితులు సద్దుమణిగి ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా విజయ నగరం జిల్లాలో కొన్ని గ్రామాలను నక్సల్స్ గ్రామాలుగా పిలుస్తూ ఉంటారు.
ప్రతి ఒకప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన నక్సల్స్ గ్రామాలు ప్రస్తుతం రాష్ట్రానికి మొత్తం ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. విజయ నగరం జిల్లా కురుపాం మండలం లోని కొండలరిడి గ్రామంలో ఏకంగా సేంద్రియ వ్యవసాయ విప్లవం కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఈ సేంద్రియ వ్యవసాయ విప్లవం కూడా ఒక టీచర్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా ఒకప్పటి నక్సల్స్ ప్రాంతం పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల 40 గ్రామాల రైతులు కూడా వీరితో జట్టు కట్టేందుకు సిద్ధమవు తున్నారు.