సోషల్ మీడియాలో ఇలా చేస్తే.. ఇట్టే దొరికిపోతారు.. జైలు శిక్ష తప్పదు సుమీ..?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా వాడటం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే గంటల తరబడి కాలం గడుపుతున్నారు.  అదే సమయంలో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ జరిగిన విషయం అయినా సరే క్షణాల్లో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో  వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఏ సమాచారం కావాలన్నా కూడా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు వరకు  అంతా బాగానే ఉన్నప్పటికీ ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం నిజమైనది  అని నమ్మడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు జనాలు.

 ఎందుకంటే అంతలా ఫేక్ న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. నిన్న హైదరాబాద్ లో భారీ ప్రమాదం జరిగిందని వార్త వాట్సాప్ తో  పాటు ఇతర సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది బాలానగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది..  ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రచారం  ఊపందుకోవడంతో అందరూ దీనిని వాట్సాప్ లో షేర్ చేశారు. రంగం లోకి దిగిన అధికారులు ఇది ఫేక్ వీడియో అంటూ అసలు విషయం తేల్చేశారు. అయితే ఇది ఒక్కటే కాదు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎన్నో ఫేక్ వీడియోలు వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

 అయితే ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారు అరెస్ట్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మొదట ఈ ఫోటోని షేర్ చేసింది ఎవరు అన్నది తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి సమస్యకు చెక్ పెట్టొచ్చు అన్నది తెలుస్తుంది.  ఇక ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా సంస్థలు మొదట తప్పుడు ప్రచారాన్ని షేర్ చేసిన వ్యక్తి గురించి వివరాలు తెలపాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు సులభంగా చిక్కనున్నారు.  చివరికి జైలు శిక్ష అనుభవించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: