పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన జనసేనికులు.. పవన్ ఇలా చేయకపోతే కష్టమే..

Suma Kallamadi
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయారు. దీంతో జనసేన పార్టీ పని అయిపోయిందని.. కొద్దిరోజుల్లోనే ఆ పార్టీ యొక్క ఓటు షేర్ గణనీయంగా తగ్గిపోతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుదారులు అనూహ్యమైన విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో జనసేన పార్టీ మద్దతుదారులు బలమైన అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులను ఓడించి గెలిచారు.
 
 
 జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుందని చెప్పడానికి పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడమే నిదర్శనంగా చూపించవచ్చు. ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. పల్లెల్లో యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రమేయం లేకుండానే ఆయన సొంత జిల్లా రాజోల్ లో 10 మంది జనసేన మద్దతుదారులు గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించారు. పల్లె పోరులో జనసైనికులు సాధించిన విజయాలను చూసి పవన్ సంతోష పడుతున్నారు. కానీ ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు పార్టీని బలోపేతం చేయాలంటే చాలా పని చేయాల్సి ఉంటుంది. జనసైనికులను ఉత్తేజపరుస్తూ ప్రసంగాలు ఇవ్వాలి. పార్టీ నాయకుడిగా మందు నుండి అన్ని చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఎంతగానో ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన పార్టీ భూస్థాపితం కావడం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
 
 
 ఇకపోతే జనసేన బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఒరిగిందేమీ లేదని చెప్పాలి. జనసేన పార్టీతో చేతులు కలిపి కాపు సామాజిక వర్గం లో తమ ఓటింగ్ శాతం బీజేపీ పార్టీ పెంచుకుంది. కానీ పెరిగిన ఆ ఓటింగ్ శాతం చెప్పుకోదగినదేమి కాదు. జనసేన పార్టీ పని అయిపోయిందని అందరూ భావిస్తున్న సమయంలో పల్లె పోరులో జనసైనికులు పోటీకి ఉరకలెత్తించి మళ్లీ కొత్త ఆశను పవన్ లో నింపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: