పుర పోరు : మారుతున్న ఓటర్ ఫల్స్.. జగనోరు, బాబోరికి ఊహించని షాక్ తప్పదా..?
ఇక ఇటీవలే కార్పొరేషన్ ఎన్నికల్లో నగర పట్టణ ప్రజలు అందరూ ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని భావిస్తున్నారు అన్నదానిపై ఆత్మసాక్షి ఒక సర్వే నిర్వహించగా ఇది కాస్త ఆసక్తికరంగా మారిపోయింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆత్మసాక్షి గ్రూప్ రెండు విడతలుగా ఫిబ్రవరి నెలలో సర్వే నిర్వహించారు. ఇక 12 కార్పొరేషన్లోని ఓటర్లను విభజించి మరి సర్వే నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు.
యువకులు నిరుద్యోగ యువత 45 సంవత్సరాల వయసు పైబడిన వారు, ఉద్యోగస్తులు భవన నిర్మాణ కార్మికులు ఇతర పనులు చేసుకునే వారిని, మహిళలు ఇలా ప్రతి ఒకరిని ప్రశ్నించే సర్వే చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు.. ధరల పెరుగుదల సహా అన్ని అంశాలపై కూడా ప్రశ్నించారు. సర్వే పూర్తయిన తరువాత పరిశీలించగా.. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసిపి 5%, తెలుగుదేశం పార్టీలకు 8 శాతం ఓట్ల శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన, భారతీయ జనతా పార్టీకి 6.8 శాతం ఓటింగ్ శాతం పెరిగినట్లు సర్వే చెబుతోంది . ఇక రెండు పార్టీలు కలిసి 14.2 శాతం ఓట్ల సంఖ్య పెంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సర్వేలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపని.. ఎటు తేల్చుకోలేని వారు 10.5 శాతం మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇలాంటి ఓటర్లు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకంగా మారుతారు అన్నది విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది చూడాలి మరి.