రేపే తుది విడుత.. బాబోరు ఇకనైనా ఆ నిజం బయట పెడతారా..?

praveen
పంచాయతీ ఎన్నికల నగారా  మోగిందో లేదో  ఏపీలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది అన్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో అటు అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు ఇక ఎంతో ప్రజాదరణ ఉన్న స్థానిక నేతలు రంగంలోకి దింపి  విజయం సాధించే దిశగా పావులు కదుపుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడు విడుదల పోలింగ్ పూర్తయింది.



 ఇక మూడు దశల ఎన్నికల్లో కూడా వైసిపి పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది ఇక జనసేన బిజెపి పార్టీలు కూడా కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించాయి. కానీ టిడిపి అసలు ఎన్ని స్థానాల్లో గెలిచింది ఎన్ని స్థానాల్లో ఓడింది అన్నది మాత్రం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. మూడు విడతల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ రాగానే ఇక అటు జనసేన బీజేపీ పార్టీలతో పాటు అధికార వైసీపీ పార్టీ కూడా తమ పార్టీ నేతలు ఎక్కడ  గెలిచారు అనేదానిపై ఒక జాబితా విడుదల చేస్తుంది.



 కానీ టీడీపీ మాత్రం ఇప్పటి వరకు సరైన జాబితా విడుదల చేయకపోవడంతో అసలు టిడిపి ఎన్ని స్థానాల్లో గెలిచింది అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.  అదే సమయంలో కొన్నిసార్లు టిడిపి సత్తా చాటి ఘనవిజయం సాధించింది అని కొన్నిసార్లు చెబుతూ ఉంటే.. మరో సారి ఎన్నికల్లో అధికార పార్టీ గందరగోళం సృష్టించింది అంటూ విమర్శలు చేస్తున్నారు టిడిపి నేతలు. ఈ నేపథ్యంలో టిడిపి ఎన్ని స్థానాల్లో  విజయం సాధించినది అనేదానిపై ప్రజలు మరింత గందరగోళంలో మునిగిపోయారు. ఇకపోతే రేపు నాలుగో విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి అనే విషయం తెలిసిందే . ఇక రేపటితో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోతున్న  నేపథ్యంలో ఇకనైనా టీడీపీ తమ లెక్కలు చెబుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: