సచిన్ మరియు లతా మంగేష్కర్ విషయంలో దర్యాప్తు లేదట...?

VAMSI
గత కొద్ది కాలంగా మహారాష్ట్రలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ శివసేన కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి  ఒకసారి శివసేన నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ను ఇచ్చింది. అలాగే  దీనికి పూర్తి భిన్నంగా హోం మంత్రి  ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న ఆయన కాస్తా... మొన్న లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి ప్రముఖ వ్యక్తులు అందరికీ సంబంధించిన సామాజిక మాధ్యమం సందేశాలు ఒకే రూపంలో ఉన్నాయి. కాబట్టి దానిమీద విచారణ జరుపుతామని చెప్పడం జరిగింది.

ఇదంతా  ముందుగానే అందరితో చర్చించి తీసుకోండి నిర్ణయం. కానీ హోం మంత్రి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి దగ్గర అవ్వడం కోసం... నాలుగో స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ కి అయాచిత వరంగా వచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు పనులన్నీ చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనను దీనిని అదునుగా చూపి తన పరువును తీయడానికి సిద్ధంగా ఉంది.  అయితే ఇవన్నీ సదరు హోం మంత్రికి అర్థం కావడం లేదని పలువురు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ఈ దశలో ఎప్పుడు అయితే సచిన్ టెండూల్కర్ మరియు లతా మంగేష్కర్ మీద చర్యలు అన్నారో... అప్పుడు ప్రజా ఆగ్రహం తీవ్రంగా చెలరేగేప్పటికి ఇప్పుడు రూటు మార్చారు. అలా కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు.

త్వరలో మమ్మల్ని డిప్యూటీ సీఎం కనుక చెయ్యకపోతే మంత్రి పదవి నుండి తొలగిపోతాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.. కాకపోతే అది జనం పట్టించుకోకుండా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఇక మళ్లీ రంగంలోకి హోంమంత్రి దిగారు.. మేం వాళ్ళ గురించి ఏమి చర్యలు తీసుకోక ముందే, భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ మీద దృష్టి పెడతాము వాళ్లకి నోటీసు ఇస్తాం వాళ్ల పై చర్యలు తీసుకుంటాం అని అంటోంది. అంటే అరుణ్ గోస్వామి మీద చర్యలు తీసుకున్నట్టు ఇప్పుడు వీళ్ళ మీద కూడా చర్యలు అంటే... తమ అధినేత్రిని సంతృప్తిపరచడానికి ఎవరినైనా ఏడిపించడానికి సిద్దం అని బహిరంగంగా చెప్పడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: