ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. రోజుకు 64 రూ.లతో.. 13 లక్షలు చేతికి..?
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎల్ఐసి అందిస్తున్న అదిరిపోయే పాలసీ లలో ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. 18 ఏళ్ళ వయస్సు నుండి 50 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. 15 నుంచి 35 ఏళ్ల కాలపరిమితితో పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ మీరు 500000 మొత్తానికి పాలసీ తీసుకుంటే మీ వయసు 35 ఏళ్లు ఉండి ఉంటే 25 ఏళ్ల కాలపరిమితి లో పాలసీ తీసుకోవాలి అనుకుంటే మీ పాలసీ గడువు తీరిన తర్వాత 1300000 చేతికి వస్తాయి.
అయితే ఒకవేళ పాలసీ గడువు ముగిసేలోగా పాలసీదారుడు మరణిస్తే అప్పుడు నామినీకి 6.25 లక్షలు లభిస్తాయి. అంతేకాకుండా ఇక పాలసీ తీసుకునే వ్యక్తి నెలకు 1925 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లించడానికి ప్రతిరోజు అరవై నాలుగు రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. అయితే ఈ ప్రీమియం చెల్లింపు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కూడా పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఎంతో మందిని న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.