శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం..?
సామాన్యులు మాత్రమే కాదు ఎంతో మంది సంపన్నులు సైతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుని తమ సంపాదనలో కొంత స్వామి వారికి అందజేయడమే కాదు.. శ్రీవారి దర్శించుకుంటూ వుంటారు. అదే సమయంలో ఎంతో మంది ఇక శ్రీవారి సమక్షంలోనే కళ్యాణం కూడా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కరోనా వైరస్ కారణంగా ఇక శ్రీవారి ఆలయానికి భక్తుల రాక నిషేధిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేయడం అంతేకాకుండా.. కరోనా వైరస్ ప్రభావం కూడా తగ్గడంతో ప్రస్తుతం భక్తులకు క్రమక్రమంగా అనుమతిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుంది.
ఇక ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల లో కళ్యాణ వేదిక ను మూసి వేయగా ఇటీవలే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఆన్లైన్లో కళ్యాణ వేదిక ను బుక్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది అయితే నిబంధనల ప్రకారం వధూవరుల తో పాటు వారి కుటుంబీకులు కూడా కరోనా వైరస్ పరీక్ష చేసుకున్న తర్వాత అనుమతించేందుకు నిర్ణయించింది. ఇక కళ్యాణ వేదిక లో పెళ్లి చేసుకున్న నూతన వధూవరుల తో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు.. 50 రూపాయల గది సౌకర్యం కూడా కల్పిస్తామంటూ తెలిపింది టిటిడి బోర్డు.