ప్రపంచంలో మేమే ప్రతివతలం అన్నట్లు బీజేపీ మాట్లాడుతోంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేసారు. మణికొండ లో, మక్తల్ లో కాంగ్రెస్ బీజేపీ సంసారం అందరికీ తెలుసు అని ఆయన ఎద్దేవా చేసారు. జిహెచ్ఎంసి మేయర్ కోసం మాకు సంపూర్ణ మెజారిటీ ఉంది అని ఆయన వెల్లడించారు. టిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఏదో కనిపెట్టినట్లు చెబుతున్నారు అని ఆయన ఆరోపించారు. మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకు ఇస్తే బీజేపీ ఓర్వలేక పోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ తమాశాలు మానుకోవాలి..మీరే హిందువులా అని ప్రశ్నించారు.
మాకు మాటలు రావా? మీలా మేము చేయలేమా అని నిలదీశారు. ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా అని ఆయన ప్రశ్నించారు. మేము చేతకాని వాళ్ళం కాదు..మాకు తిట్టరాదా అని ఆయన నిలదీశారు. మా దగ్గర లక్షలమంది ఉన్నరు.. మీరు ఉన్నది కొంతమందే అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దేశంలో కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. ప్రభుత్వ డబ్బులతో యాదాద్రి కడుతున్న మొగోడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఎవరి ఓట్లు చీలుద్దామని బీజేపీ నిన్న పోటీ చేసింది అని ఆయన తెలిపారు.
మీకు మెజారిటీ లేంది? ఎందుకు పోటీ చేశారు అని నిలదీశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో చేసినట్లు చేద్దామనుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇక తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ అరవింద్ కు కుక్క కరిచింది అని ఎద్దేవా చేసారు. ఆయనకు తెలంగాణకు నిధులు తేవడం చేతకాదు అన్నారు. ఐటీఐఆర్ మీద కేంద్రమంత్రి అన్ని తప్పులు చెప్పారు అని మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ తన పద్ధతి మార్చుకోవాలి అని బాల్క సుమన్ హెచ్చరించారు. ముందు పసుపు బోర్డ్ తీసుకురా అని సూచించారు. ఇష్టానుసారం మాట్లాడితే బిడ్డ ఊరుకోమ్ ఖబడ్దార్ అని హెచ్చరించారు.