ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఓటింగు కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఒక జిల్లాలో ఒక పంచాయితీలో ఒక విచిత్ర కరమైన పరిస్థితిని అక్కడి ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని సిరువెళ్ల మండలం వీరరెడ్డిపల్లిలో వార్డ్ మెంబెర్స్ గా పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న అయోమయానికి గురయి నవ్వులపాలవ్వడం వైరల్ అవుతోంది. ఎన్నికల అధికారి వార్డ్ అభ్యర్థులుగా వారికి కేటాయించిన గుర్తుల విషయంలో పొరపాటు పడి అక్కడి వారి అటెన్షన్ కు కారణమయ్యారు.
వీరు ఏం చేశారంటే ఒకరి గుర్తుతో మరొకరు ప్రచారం చేశారు. దీనితో కొంతసేపటి తరువాత వారి దగ్గరే ఉన్న బ్యాలెట్ పేపర్ చూసి అవాక్కయ్యారు. ఆ గ్రామంలోని ప్రజలు వీరిని చూసి నవ్వుకున్నారు. ఇటువంటి కీలక సమయంలో అంత అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎంత నష్టమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు పడవలసిన ఓట్లన్నీ మీ ప్రత్యర్థికి పడిపోతాయి . తద్వారా జరిగే ఎన్నికలలో మీరు ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీకు కేటాయించిన గుర్తు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. కాగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఓటింగు శాతం క్రమక్రమంగా పెరుగుతోంది.