వోడ్కా తాగుతూ చనిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. అసలేం జరిగిందంటే..?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు వచ్చి కబళిస్తూ ప్రాణాలను తోడుకు  పోతూ ఉంటుంది. ఇక్కడ వృద్ధుడి  విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. డబ్బుకు ఆశపడే వృద్ధులు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారూ.  మొన్నటివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల చాలెంజ్ లు వైరల్గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఛాలెంజ్ ను  స్వీకరించి ఇక ఆ ఛాలెంజ్  పూర్తి చేయడానికి ఎంతో మంది సాధారణ ప్రజలు కూడా ఎంతగానో మొగ్గు చూపారు. అయితే కొన్ని రకాల చాలెంజ్ లు  ఫన్నీ గా ఉన్నప్పటికీ మరికొన్ని రకాల చాలెంజ్ లు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చేలా ఉన్నాయి.



 ఇలా ప్రాణాంతకమైన ఛాలెంజ్ లు  సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమయంలో అలాంటి చాలెంజ్ ఎవరు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇలాంటి ఒక ఛాలెంజ్  వృద్ధుడి ప్రాణం తీసింది. లైవ్ లో వోడ్కా లేదా హాట్ సాస్  తాగాలి  ఓ యూట్యూబ్ సవాల్ విసిరాడు. ఈ రెండింటిలో ఏది తాగినా కూడా భారీగా డబ్బులు బహుమతిగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రకటన రాగానే ఇది చూసిన ఎంతోమంది ఆ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.



 అయితే ఈ ఛాలెంజ్ చేసే వారికి ఎలాంటి వయస్సు నిబంధన పెట్టకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బు వస్తుంది అని ఆశతో ఆ పోటీలో పాల్గొన్నాడు. రష్యాకు చెందిన ప్యూరీ  దుషకేచిన్  అనే వ్యక్తి పోటీకి సిద్ధమని లైవ్ లోనే 1.5 లీటర్ల వోడ్కా సేవించాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇక అంతలో లైవ్ లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వోడ్కా తాగుతూ  ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో నెటిజన్లు అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి చెత్త చాలెంజ్ ల  జోలికి ప్రజలు పోవద్దు అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: