కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. లేఖలో తనకు ప్రభుత్వం నుండి ముప్పు ఉందని రక్షణ పెంచాలని కోరారు. ప్రభుత్వం పై చేస్తున్న పోరాటం నేపథ్యంలో తనకు ముప్పు ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హై కోర్ట్ అదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ రేవంత్ రెడ్డి తనకు సెక్యూరిటీ పెంచాలని లేఖ రాశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పై విమర్శలు చేయడంలో రేవంత్ రెడ్డి ముందుంటారు. ప్రభుత్వ పథకాల్లోని లోపాలను. . విధానాలను ఎత్తి చూపడంతో పాటు ధర్నాలు, నిరసనలు చేస్తు ప్రభుత్వంపై నాయకులపై విమర్శల బుల్లెట్లు కురిపిస్తారు. ఇన్డైరెక్ట్ గా కాకుండా రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేస్తుంటారు. అంతే కాకుండా తెలంగాణలో ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత కూడా రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. దాంతో తెలంగాణ పీసీసీ రేస్ లో కూడా ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డివైపే ఉందని...దాదాపు ఖరారు అయిందని వార్తలు వచ్చాయి. కానీ పార్టీలోని సీనియర్ నేతల అసంతృప్తితో ప్రకటన కాస్తా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ కంటే పార్టీ కమిటీ భాద్యతలు అప్పగిస్తే హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పారు. తాను స్పీకర్ అని..ఆ పదవి అయితే జనాలకు దగ్గరవడం కూడా సులభమని ఆయన వెల్లడించారు. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీ లో చేరుతారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. బీజేపీ లో ఆయనకు కీలక పదవి ఇవ్వబోతున్నారని..త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కథనాలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి వాటిని ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: