పల్లె ప్రజలకు గుడ్ న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం..?

praveen
ప్రస్తుతం అన్ని విషయాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా పల్లెలే  దేశానికి పట్టుకొమ్మలు అన్న నానుడిని ఫాలో అవుతూ ఇక పల్లెల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది. పల్లెల్లో మౌలిక వసతులు కల్పించడమే కాదు విద్య వైద్య సదుపాయాలను మరింత మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే గ్రామాల్లో నివసిస్తున్న ఎంతో మంది ప్రజలకు మెరుగైన వసతులు అందే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల పల్లె ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.



 ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలు మాత్రం ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల సదుపాయాలు పొందలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక వైద్యం చేయించుకోవడానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్లను  ఆశ్రయిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రజల ఇబ్బందుల పై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో ఉన్న ఆరోగ్య కేంద్రాలను రానున్న రోజుల్లో ప్రభుత్వం క్లినిక్ లు గా మార్చేందుకు సిద్ధమైంది.  ఇటీవలే ఈ అంశంపై చర్చించింది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని పల్లె ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పింది.




 ఈ క్రమంలోనే పల్లె ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని మరింత దగ్గర చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగానే గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ క్లినిక్ గా  మార్చేందుకు నిర్ణయించింది. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 4905 ఉప కేంద్రాలు ఉండగా అందులో ఎంబిబిఎస్ లేదా హోమియోపతి లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్స్ లను ప్రజలకు వైద్యం అందించేందుకు నియమించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇది పల్లె ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: