బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...
ఇక పూజార్లు జనాల కోసం గుడిలో దేవుడికి మొక్కుతారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి పూజని దగ్గరుండి మరీ జరిపిస్తారు. అలాగే పూజా కార్యక్రమాలు అయిపోయాక గుడిని వారే శుభ్రం చేసుకుంటారు. ఇక అలాంటి పూజార్లు బ్రతకడానికి వారికి డబ్బులు ఎలా వస్తాయి. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బులు వారికి సరిపోవు. అవి కూడా వున్నవాడు ఇస్తాడు. లేనివాడు ఇవ్వలేడు కాబట్టి పూజార్లకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రతినెలా జీతం రావాలి. అలా అయితే ఏ బ్రాహ్మణుడికి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు వుండవు.
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!