గత కొన్నేళ్లుగా కాపు హక్కుల కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్న పరిష్కారం మాత్రం లభించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా కాపు వర్గాన్ని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి సమస్య ను పట్టించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో హామీలు ఇవ్వడం..తీర అధికారం లోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టేయడం.. ప్రతి పార్టీ కూడా ఇలాగే చేస్తుందంటూ కాపు వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో ఆదివారం కాపు నేతల భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జగనోరి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.