టీడీపీలో వీళ్లంతా అవుటే... బాబుకు న‌మ్మ‌కం లేకే ?

VUYYURU SUBHASH
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అధికారానికి దూరమై 20 నెల‌లు అవుతోంది. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రావ‌డంతో ఆ పార్టీ నేత‌ల్లో కాస్త క‌ద‌లిక వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేదు.  కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను న‌డిపించే నాయ‌కులు కూడా లేరు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక న‌లుగురు ఎమ్మెల్యే ల‌తో పాటు చాలా మంది ఇన్ చార్జ్‌లు కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఇన్‌చార్జ్ లు అస‌లు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లోనే చాలా మంది యాక్టివ్ గా లేని దుస్థితి.

చివ‌ర‌కు పార్టీకి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ చార్జ్ లు కూడా లేక ద్వితీయ శ్రేణి నేత‌ల‌నే బాబు ఇన్ చార్జ్‌ల‌ను చేస్తున్నారు. తాజాగా వరుస వీడియో కాన్ఫ‌రెన్స్ ల‌తో పార్టీ శ్రేణుల‌ను బెంబేలెత్తిస్తోన్న చంద్ర‌బాబు స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ సర్వే చేయించార‌ట‌. ఈ సర్వేలో మొత్తం 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ప‌ట్టే నాథుడు కూడా లేడ‌ని తేలింద‌ట‌. ఇక 31 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జ్‌లు ఉన్నా వారు పార్టీ కార్య‌క‌లాపాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

ఇక మ‌రో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త‌గా ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించాలి. ఈ లెక్క‌న చూస్తే 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, గ‌ణ‌బాబు, బాల‌కృష్ణ‌, ప‌య్యావుల కేశ‌వ్ లాంటి వాళ్ల ఒరిగింది కూడా క‌న‌ప‌డ‌డం లేదు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామారాజుది అదే ప‌రిస్థితి. అస‌లు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేయేనా ? అన్న సందేహాలు పార్టీలోనే చాలా మందికి ఉన్నాయి. ఇక ఈ సిట్టింగుల‌తో పాటు చాలా మంది ఇన్‌చార్జ్‌ల‌ను బాబు మారుస్తార‌ని.. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్టినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేద‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: