మీరు ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకున్నారు.. ఇది తెలుసుకోండి..?

praveen
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విఆర్వో వ్యవస్థను రద్దుచేసి ఇక ధరణి పోర్టల్ ని తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ద్వారా ఎంతో సులభతరంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను మార్చేందుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదట ధరణి పోర్టల్  ప్రారంభించిన సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పప్పటికీ.. ప్రస్తుత ధరణి  పోర్టల్   ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ధరణి  పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇక ఎంతోమంది  వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటూ ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



ధరణి  పోర్టల్ తో పాటు ఎల్ఆర్ఎస్ అనే సరికొత్త రూల్ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై ఖాళీ స్థలంపై  పన్ను విధించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ల క్రమబద్దీకరణ పన్నుల పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకే రాష్ట్రప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకు వచ్చింది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీపై దుమ్మెత్తి పోసాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఎల్ఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గలేదు.



 అయితే ఇంతకాలం పాటు యజమానుల చిరునామా తెలియక పోవడంతో ఇక ఎక్కువ శాతం ఖాళీ స్థలాలపై ప్రభుత్వం పన్నులు విధించ లేకపోయింది.. ఇక ఇటీవల ఎల్ఆర్ఎస్ దరఖాస్తు లో భాగంగా ఫ్లాట్ల విస్తీర్ణం.. యజమాని యొక్క పూర్తి వివరాలను కూడా సేకరించింది  ప్రభుత్వం. ఇక ఈ సమాచారాన్ని ఫ్లాట్ల క్రమబద్ధీకరణ తో పాటు పన్ను విధింపు కూడా ప్రస్తుతం ఉపయోగించనుంది  తెలంగాణ ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరు పన్ను  కట్టడం తప్పనిసరిగా మారిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే కొత్త నిబంధన తీసుకురాగానే ఎంతో మంది ప్రజలు ఖాళీ స్థలాలు ఉన్నవాటిని క్రమబద్దీకరణ చేసుకునేందుకు మీసేవ  కేంద్రాలకు వెళ్లి ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: