బైడెన్ వచ్చిన ఏం మారలేదు.. ఇక చైనాకి చుక్కలే..?
ఈ క్రమంలోనే జో బైడెన్ అధికారంలో పాలసీలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో పాకిస్థాన్ చైనా దేశాల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం తో ఉంటు భారత్ పై ఎంతగానో అమితమైన ప్రేమ చూపించారు. కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్థాన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గి కొన్ని సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చైనాతో కూడా అమెరికా మరికొన్ని రోజుల్లో సత్సంబంధాలు మెరుగు పరిచుకోబోతుంది అని అందరు అనుకున్నారు. కానీ చైనా లాంటి నియంతృత్వ దేశంతో సంబంధం అంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందరికీ తెలుసు కాబట్టి జో బైడెన్ ప్రభుత్వం చైనా విషయంలో మాత్రం వెనక్కు తగ్గేదే లేదు అన్నది అర్ధమవుతుంది.
ఇటీవల ఐక్యరాజ్యసమితిలో అమెరికా అంబాసిడర్ గా నియమితులైన అటువంటి లిండా గ్రీన్ ఫీల్డ్ చైనా దురహంకార పూరిత వైఖరిని కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేయాల్సిందే అంటూ ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆసక్తి కరం గా మారిపోయింది. గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో వ్యవహరించినట్లు గానే ప్రస్తుత అధ్యక్షుడు కూడా అదే పాలసీలు కొనసాగిస్తారా లేదా అన్న దానిపై మరింత ఆసక్తి పెరిగిపోయింది.