చైనా మోసం.. మరో ఆధారం బయటపడింది.. డబ్ల్యుహెచ్వో ఏం చేస్తుందో..?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా అన్ని దేశాలను వణికిస్తూనే  ఉంది. అగ్రరాజ్యాలలో  అయితే విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ ఎంతో మంది ఉసురు పోసుకుంటుంది. ఇక ఎంతో మందికి తమ ప్రియమైన వారిని దూరం చేసి కుటుంబాల్లో ఎన్నటికీ తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి   కరోనా వైరస్. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై మాత్రం ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చింది అని చైనా చెబుతున్నప్పటికీ ఊహన్ లో  ఉన్న ల్యాబ్ లో సృష్టించబడింది అన్న పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది అని తెలిసినప్పటికీ చైనా ఈ నిజాలను దాచిపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పాకి  పోయిన తర్వాత అప్పుడు మనిషి నుంచి మనిషికి పాకుతుంది అన్న నిజాన్ని బయట పెట్టింది అన్నది ప్రపంచం ఎరిగిన సత్యం. కానీ చైనా మాత్రం ఇప్పటికీ ఈ విషయాన్ని దాచాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పరిశోధనలు జరపడానికి అనుమతించడం లేదు చైనా.


 కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో ప్రపంచానికి పాకిపోయేలా చేయాలి అనే ఉద్దేశంతో చైనా చేసిన వ్యవహారం మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఇటీవల చైనా దురాగతానికి సంబంధించి మరో ఆధారం బయటపడింది.. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై నిజాలు బయట పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్క విషయంలో కఠినంగా వ్యవహరించింది. చైనాలో షేంజన్  నగరానికి సంబంధించినటువంటి జంగ్ హై  అనే వ్యక్తి తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊహాన్ తీసుకురాగా ఇక్కడ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ గురించి దాచిపెట్టిన నిజాలు తెలుసుకొని బయటపెట్టేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నించగా సోషల్ మీడియా అకౌంట్ ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే తనను  ఎలాగో అధికారులు అరెస్టు చేస్తారని అంతలోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు  తన దగ్గరికి వస్తే పూర్తి వివరాలు ఆధారాలతో సహా వెల్లడిస్తాను అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: