రైతు అల్లరి మాటున దాగిన నిజం.. ఇది దేశానికే గర్వకారణం..?
అయితే గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో మీడియాలో ఎక్కడ చూసిన కూడా రైతులు పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణ అంతే కాకుండా.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం పైనే ఎక్కువగా ఫోకస్ చేసి చూపించారు అన్న విషయం తెలిసిందే. కానీ రైతులకు సృష్టించిన ఉద్రిక్త పరిస్థితులు మాటున దాగిఉన్న ఒక గొప్ప విషయం మాత్రం మీడియా చేసిన పనికి కనిపించకుండా పోయింది అని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా గణతంత్ర దినోత్సవం రోజు భారత సైనికులు పెరేడ్ చేసి ఇక భారత ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతి కి సెల్యూట్ చేస్తూ ఉంటారు.
ఇటీవలే గణతంత్ర దినోత్సవం రోజున.. కేవలం భారత ఆర్మీ మాత్రమే కాదు అటు నేపాల్ కు చెందిన గూర్ఖా టీమ్ కూడా పెరేడ్ లో పాల్గొని రాష్ట్రపతికి సెల్యూట్ చేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్కు చెందిన వాయుసేన,ఆర్మీ, నేవీ కూడా ఇక గణతంత్ర దినోత్సవం రోజున పెరేడ్ లో పాల్గొని రాష్ట్రపతికి సెల్యూట్ చేయడం సంచలనం గా మారిపోయింది. ఇంత గొప్ప విషయాన్ని భారత మీడియా మాత్రం ఎక్కడా చూపించలేదు అని అంటున్నారు విశ్లేషకులు.