జగడ్డ: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్..!
దీంతో కుప్పం నియోజకవర్గంలో తమ వారికి పంచాయతీలు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. మరోవైపు మంత్రులు ఇద్దరు.. నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎవరికి వారుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక, పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ నాయకులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఉండడంతో పార్టీని నడిపించే వారు కూడా కనిపించడం లేదు. పైకి మాత్రం అంతా ఏకతాటిపై నడుచుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. లోపాయికారీగా మాత్రం ఎవరి దారిలో వారు వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఇక, టీడీపీ పరిస్థితి మరో విధంగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసే నాయకుడు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై పడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులు పుంజుకున్నది కూడా కనిపించడం లేదు. పైగా నేతల కొరత.. ఎవరికి వారుగా పార్టీకి దూరంగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ హవా అంతంత మాత్రంగానేఉంది.
శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పుంజుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ శ్రేణులు ఎక్కడా దూకుడు ప్రదర్శించలేక పోతున్నాయి. ఒక్కపలమనేరులో మాత్రం మాజీ మంత్రి అమర్‌నాథ్ ఒకింత దూకుడుగా ఉన్నారు. కుప్పంలో చంద్రబాబుకు సానుభూతి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ దూకుడుగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పంచాయతీలో వైసీపీకి, టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.