ప్రేమించిన యువతి ఆత్మహత్య.. మనస్తాపంతో దుబాయ్లో యువకుడు..!?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మానాల రాకేష్(21) అనే యువకుడు దుబాయ్లో బతుకుదెరువు కోసం వెళ్లాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన మనీషా గొల్లపల్లిలోని ఓ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒక్కరిని ఒకరు ఇష్టపడరు. ఆ యువతికి ఓ పెళ్లి సంబంధం చూశారు. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేందుకు ఆ అమ్మాయి భయపడటంతో పెద్దలు పెళ్లిని కూడా నిశ్చయించేశారు.
దీంతో ఆమె ప్రియుడిని మర్చిపోలేక, పెద్దలు చూసిన పెళ్లిని చేసుకోలేక ఆ అమ్మాయి తీవ్ర మనోవేధనకు గురయింది. చివరకు ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. అయితే పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పలేక మనీషా తీవ్ర మనోవేధనకు గురయింది. ప్రియుడిని మోసం చేసి మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేకపోయింది. దీంతో రెండ్రోజుల క్రితం గోవిందుపల్లిలోనే తన ఇంట్లో మనీషా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే ప్రేయసి మరణవార్త గురించి రాకేష్ కు కాస్త ఆలస్యంగా తెలిసింది. దీంతో అతడు తీవ్రంగా బాధపడ్డాడు. ప్రేయసి తన కోసమే చనిపోయిందనీ, ఆమె లేని లోకంలో తాను ఉండలేననీ ఆవేదన చెందాడు. తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియోలో తల్లికి రికార్డు చేసి పంపించాడు. ఆ తర్వాత దుబాయిలో తాను ఉంటున్న రూమ్ లోనే ఉరేసుకుని చనిపోయాడు. ప్రియుడు రాకేష్ వీడియో గ్రామంలో వైరల్ గా మారింది. ఈ ఘటన రెండు ఊళ్లల్లో చర్చనీయాంశంగా మారింది. క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిందనీ, తల్లిదండ్రులకు చెప్పి ఉంటే పరిస్థితి ఏమైనా మారేదనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.