ఈ పథకం ఎవరికి ప్రయోజనం!

Kuthuru RajiReddy
కుటుంబం యాజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని కొంత వరకు ఆర్థికంగా ఆదుకోవడం కోసం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా అందజేసే డబ్బులను 20వేల రూపాయల వరకు పెంచుతు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 5వేలు, 10వేల వరకు ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కుటుంబాలకు అందజేసేవారు. 18 సంవత్సరాల నుండి 64సంవత్సరాల లోపు కుటుంబ యాజమాని చనిపోతే కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం గతంలో 10వేల రూపాయల వరకు అందజేసేది. కాగా ఈ పథకం అందరికి అందక పోవడంతో పలువిమర్శలను ఎదుర్కొంది. పైరవికారులు, నాయకులు, అధికారులు కుమ్ముక్కై వారికి కావాల్సిన వారికి ఈపథకం మంజూరీ చేయించుకునేవారు. దీంతో ఈ పథకం కొందరికే పరిమితమైంది. దీంతో కొంత మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని భావించిన ప్రభుత్వం ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశ్యంతో 5వేలకు తగ్గించింది. కాగా ఇలా చేసినప్పటికిని కొన్ని ప్రాంతాల్లో సంబంధిత అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు చనిపోయిన వారి కుటుంబాల నుండి డబ్బులను తీసుకుంటు కొంత మందికే డబ్బులను మంజూరీ చేసేవారు. కాగా అర్హులైనుటువంటి ఎంతో మంది కుటుంబ పెద్దలను పోగొట్టుకున్నవంటి వారు కార్యాలయాల చుట్టు తిరిగి డబ్బులు రాక పోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈపథకం ద్వారా అందజేసే డబ్బులను 20వేల వరకు పెంచుతు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ పథకంలో నిబంధలను కూడా పెట్టింది. గతంలో చనిపోయిన కుటుంబ యాజమాని వయస్సు 18 నుండి 64 సంవత్సరాలుండగా ప్రస్థుతం వయస్సును 59 సంవత్సరాలకు కుదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నవంబర్ 1నుండి అమలులోకి వస్తుంది. కాగా పెంచినటువంటి డబ్బులు అర్హులకు అందాలంటే ముందుగా జీతం చాలదన్నట్లుగా బాధిత కుటుంబాల నుండి లంచాలు తీసుకుంటున్నటువంటి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఈ పథకం అర్హులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: