మధ్య ప్రదేశ్ లో దారుణం.. బాలికపై వృద్దుడు అత్యాచారం.. ఆపై అమానుషం..

Satvika
వావి వరుసలు కూడా పూర్తిగా మార్చి పోయి చాలా మంది దారుణాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి కనిపించిన ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలం లో చాలానే వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ వృద్దుడు తన వయసును కూడా మర్చిపోయి బాలిక పై అత్యాచారం చేశాడు. దాంతో మానసికంగా శారీరకంగా కృంగిపోయిన బాలిక ఇటీవల ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది.

వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యారేమియా అనే వ్యక్తి స్థానికంగా వార్తా పత్రిక నిర్వహిస్తున్నాడు. ఇతడు తన వద్ద పనిచేసే ఐదుగురు బాలికలపై పలు పర్యాయాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు గత ఏడాది జూలైలో కేసు నమోదయింది. ఇతని బారిన పడిన బాలికలందరికీ స్థానిక షెల్టర్‌ హోం లో ఆశ్రయం కల్పించారు. బాధితుల్లో ఇద్దరు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు.

వారి లో ఒక బాలిక మోతాదుకు మించి నిద్ర మాత్రలను వేసుకుంది.పరిస్థితి విషమించి ఆమె బుధవారం రాత్రి కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. ఘటన పై అధికారులు మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. నిందితుడైన ప్యారేమియాను జమ్మూ కశ్మీర్‌ లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన స్వీటీ విశ్వకర్మ పై కేసు నమోదు చేశారు. గత ఏడాది జూలై లో అతని నివాసంలో జరిపిన సోదాల్లో ఖరీదైన కార్లు, మద్యం బాటిళ్లు, వన్యప్రాణుల ఎముకలు, పోర్న్‌ సీడీలు మొదలగు వస్తువులు లభించాయి. ప్యారే మియా పై ఐపీసీ, పోక్సో, అట్రాసిటీ, ఎక్సైజ్, వైల్డ్‌ లైఫ్‌ చట్టాల కింద నమోదు చేసి నిందితుడిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: