శబరిమల వెళ్తున్నారా..? అయితే అవి తీసుకెళ్లడం మరిచిపోకండి..!

NAGARJUNA NAKKA
శబరిమలలో మకరజ్యోతి దర్శనాన్ని అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతి దర్శనం కోసం భక్తులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ఆకాశంలో ఆ అద్భుతం కనిపించగానే భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. సాధారణంగా ప్రతి ఏడాది ఈ సీజన్‌లో లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేవారు. కరోనా నేపథ్యంలో ఈసారి మకర విలక్కు పండగపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతి ఇస్తోంది.
అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది. తనకు ఇష్టమైన ఈ రోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకొని, మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటారు.
మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది. కరోనా నిబంధనల దృష్టా రోజుకు 5వేల మంది భక్తులకు మాత్రమే దర్శన సౌకర్యం కల్పించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టును తీసుకువెళ్లాలి.
 
కరోనా నేపథ్యంలో శబరి దర్శనాల విషయంలో ఈ సారి ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు కీలక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లు ఉన్న వారిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. ఇక నిలక్కల్ సెంటర్ వద్ద కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలి. లేని వారిని అనుమతించరు. అక్కడ టెస్ట్‌లు చేయరు. అందుకే బయటి నుంచే కోవిడ్ పరీక్షలు చేయించుకొని రిపోర్టును వెంట తీసుకురావాలి. 48 గంటల్లోపు తీసిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ చెల్లదు. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి.
ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో జరుగుతుంది. శరణకుట్టి ఆరోహణ 19 న జరుగుతుంది. 19 వ తేదీ వరకు మాత్రమే భక్తులకు కలియుగవారదాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ నడక మార్గం 20వతేదీన ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు గణపతి హోమం జరుగుతుంది. రాజ కుటుంబ సభ్యుల దర్శనం తరువాత హరివరసాన గానంతో మరుసటి రోజు ఉదయం ఆరున్నరగంటలకు ఊరేగింపు ముగుస్తుంది. దీంతో మకరవిలక్కు పండుగ ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: