పండగ పూట.. ఆ విషయంలో జాగ్రత్త.. ప్రాణం పోతుంది..?
అంతేకాదు ఇక సంక్రాంతి జోష్ లో ఫుల్లుగా మద్యం తాగడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగానే పండుగ సీజన్ అంటే మద్యం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అటు బంధువులు అందరూ రావడంతో ఇక మద్యం తాగడం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే కాస్త జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు అని సూచిస్తున్నారు నిపుణులు. ఈ పండుగ సమయంలో ఫుల్లుగా మద్యం తాగి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటే మాత్రం కాస్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడక్కడా కల్తీ మద్యం తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కల్తీ మద్యం ప్రస్తుతం కోరలు చాస్తోంది. ఇప్పటికీ కల్తీ మద్యం ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. కొన్ని రోజుల క్రితమే వికారాబాద్ లో కల్తీ మద్యం తో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లో అయితే కల్తీ మద్యం కారణంగా ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పండుగ సీజన్లో మద్యానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి కల్తీ మద్యం సరుకులతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.