సరిగ్గా గంట ముందు ఉరిశిక్ష రద్దు.. ఎందుకో తెలుసా..?

praveen
సాధారణంగా అమెరికాలో నేరస్తుల పట్ల కఠిన శిక్షలు అమలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  నేరస్తులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించడానికి ఎక్కడ వెనుకడుగు వేయరు. కాగా 2004 సంవత్సరంలో ఓ గర్భిణీ మహిళను దారుణంగా హతమార్చిన ఓ మహిళకు అక్కడి కోర్టు ఉరి శిక్ష విధించింది.. ఈ కేసుకు సంబంధించి అక్కడి వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతూ వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఇక ఉరిశిక్ష రేపు  అమలు కానుంది.  కానీ ఉరి శిక్ష అమలు కానున్న 24 గంటల ముందు ఉరిశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది.



 అయితే అమెరికా చరిత్రలోనే మొదటి సారి ఒక మహిళకు ఉరిశిక్ష పడటం ఉరిశిక్ష కోసం అంతా సిద్ధం  కావడం సంచలనంగా మారింది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో సదరు మహిళకు ఉరి శిక్ష పడకుండా ఆపేందుకు ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.  ఇక మొదట న్యాయవాది వాదనలు తోసిపుచ్చిన కోర్టు ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సిందేనంటూ తీర్పును ఇచ్చాయి.  అదే సమయంలో ఒక వేళ జో బిడెన్  అధికారంలోకి వస్తే సదరు మహిళ యొక్క ఉరిశిక్ష రద్దు చేసే అవకాశం ఉంది అన్న వాదనలు కూడా వినిపించాయి.



 కానీ జో  బిడెన్  ప్రమాణ స్వీకారం చేసే ముందే సదరు మహిళకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండడంతో ఉరిశిక్ష పడటం ఖాయం అని అనుకున్నారు అందరు. ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన లీసా అనే మహిళా 2004 సంవత్సరంలో గర్భిణీ మహిళ కడుపు కోసి బిడ్డను బయటకు తీసింది. ఈ ఘటనలో బిడ్డ క్షేమంగా బయటపడగా  తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను కోర్టులో హాజరుపరచగా 2008లో ఆమెకు ఉరి శిక్ష పడింది.  ఇక దీని పై వాదనలు జరుగుతూ రాగా జనవరి 14వ తేదీన ఆమె కు ఉరిశిక్ష పడాల్సి ఉంది. కానీ ఆమె తరపు న్యాయవాది నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదని చెప్పడంతో కోర్టు  ఆమె ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: