ప్రశాంత్ కిషోర్ తో కలిసి మరో రాజకీయ వ్యూహానికి సిద్ధమైన జగన్...!
రాజకీయ పరంగా వీరిద్దరు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటు సీఎం పాలనా పరంగా క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు. అటు ప్రశాంత్ వ్యూహకర్తగా ఫుల్ బిజీగా ఉంటారు.
అందులోనూ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు సాయ శక్తులా ప్రయత్నిస్తూ ఎంతోహడావిడిగా ఉన్నారు. అలాంటి ఇరువురు భేటీ అయ్యారు అంటే అతి ముఖ్యమైన అంశం అని అర్థమవుతుంది.
గత 2019 ఎలక్షన్లలో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రశాంత్ ముఖ్య భూమికను పోషించారు. అయితే ఇంత బిజీగా ఉన్న వీరిద్దరూ ఇలా ఎందుకు సమావేశము అయ్యారు..?? అందులోనూ వీరు చర్చ రెండు గంటల పాటు కొనసాగింది అంటే... అంత అతి ముఖ్యమైన అంశాలు ఏమిటి..?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై పలు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారి ఇరువురి నడుమ జరిగిన చర్చ ఇదేనంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఈ చర్చకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఈ అంశంపై వినబడుతున్న కొన్ని ఊహాగానాలు చూస్తే నిజమే అనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం... జగన్ సర్కారు గతంలో లేని విధంగా ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతుంటే.. అధికార ప్రభుత్వం పై మాత్రం మైలేజీ సరిగా లేదని.. దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసిపిని మరింత దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి చర్చించినట్లు సమాచారం. అక్రమాలు చేయొద్దని అవినీతి రాజకీయాలు చేయొద్దని... అక్రమంగా సొమ్మును కూడ పెట్టొద్దని.... అందరూ కలిసి ఐకమత్యంగా పని చేద్దాం అని జగన్ మొత్తుకుంటున్నా ఎవరికి వారుగా రాజకీయాలు చేయడం అన్న అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది వాలంటీర్ వ్యవస్థ..ఇది వచ్చిన తర్వాత.. వైసీపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్ గా లేరని జగన్ ప్రశాంత్ కిశోర్ తో చర్చించినట్టు సమాచారం. అన్నీ వాలంటీర్లే చూసుకుంటు న్నారు.. దీని ప్రభావం పార్టీపై పరోక్షంగా పడుతుంది. కాబట్టి దీనిని సరైన మార్గంలో పెట్టేందుకు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు టాక్. ఇలా రకరకాల అంశాలపై మాట్లాడినట్లు తెలిసింది...భవిష్యత్తులో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి మార్పులను చేర్పులు తీసుకురాబోతున్నారో తెలియాల్సి ఉంది.