హైకోర్ట్ ఎఫెక్ట్: కీలక అధికారిని తొలగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఆమెను తొలగిస్తున్నట్టు సీఎస్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని, ఈ కారణంగా ఆమెను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాణీ మోహన్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న జీవీ సాయి ప్రసాద్‍పై కూడా ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జీవీ సాయి ప్రసాద్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారని, అంతేకాకుండా ఇతర ఉద్యోగులను కూడా తన విధంగానే సెలవుపై వెళ్లిపోవాలంటూ వారిని ప్రభావితం చేసినట్టు ఎస్ఈసీ చెబుతున్నారు.
ఇటువంటి చర్యలను క్రమశిక్షణా రాహిత్యంగా ఎన్నికల సంఘం పరిగణించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ చర్యలు విఘాతం కలిగించేలా విధంగా ఉన్నాయంటూ తేల్చిన ఎస్ఈసీ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. కాగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకూడదనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఆయన పదవి పూర్తి అయ్యేలోపు ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు.