రెండు వైపులా యుద్ధ ట్యాంకులు.. భారత్ సిద్ధమైంది..?

praveen
భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. మొదట చర్చల ద్వారా సరిహద్దులో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి భారత్  ప్రయత్నించినప్పటికీ చైనా డబుల్ గేమ్ ఆడటం తో ఇక భారత్ కూడా దూకుడు వ్యవహరించింది.  ఈ క్రమంలోనే భారత ఆర్మీ ఎంతో దూకుడుగా వ్యవహరించి చైనా కు సంబంధించిన పలు భూభాగాలను అదీనంలోకి  తెచ్చుకోవడంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది.  అయితే భారత్ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అటు చైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని అందరూ భావించారు




 కానీ అప్పటివరకూ తోక జాడిస్తూ  సరిహద్దుల్లో ఉద్రిక్తత  సృష్టించిన  చైనా ఆ తర్వాత మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది. అయితే చైనా సైలెంట్ గా ఉండడానికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అని అందరూ భావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్  గెలిస్తే గనుక.. బిడెన్ ను  తనవైపుకు తిప్పుకుని భారత్ ను  కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నదే  చైనా ప్లాన్ అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే భారత్ మాత్రం ఎవరిపైనా ఆధారపడకుండా సింగిల్ గా యుద్ధం  చేసేందుకు సిద్ధమవుతోంది.  ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోతుంది.



 ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  ఇరు దేశాలు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది.  సరిహద్దుల్లో  భారత్ ప్రస్తుతం మిర్రర్ డిప్లయ్ మెంట్   వ్యూహాన్ని అమలు చేస్తోంది అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం సరిహద్దులో చైనా ఎలాగైతే సైనికులను, యుద్ధ ట్యాంకులను మోహరిస్తుందో   అటు భారత్ కూడా అదే సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించడంతో పాటు  సైనికులను కూడా మోహరిస్తుందని .  ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఇరువైపులా కూడా యుద్ధ ట్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.  రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: